అమరజీవి
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్
చేసిన కఠోర పరిశ్రమకు...
చూపిన ముందు చూపుకు...
మచ్చలేని వారి వ్యక్తిత్వానికి...
అపారమైన వారి మేధస్సుకు...
వారి తపనకు త్యాగగుణానికి
ప్రతిబింబం మన భారతరాజ్యాంగం
ఇది రాజ్యాంగమే కాదు
ఇది ముస్లింలకు......ఖురాన్
ఇది క్రిష్టియన్ లకు...బైబిల్
ఇది హిందువులకు...భగవద్గీత
మరో వెయ్యి
ఏళ్ళకైనా
చెక్కుచెదరని
శిలాశాసనాలవంటి
స్థిరమైన పటిష్టమైన
సుపరిపాలనా సూత్రాలను
అందులో పొందు పరిచి...
ప్రభుత్వ పాలనా
విధివిధానాలను...
పౌరహక్కుల పరిరక్షణే
ప్రధాన లక్ష్యంగా
ప్రజాస్వామ్య బద్ధంగా
భారతీయులందరి
సంక్షేమాన్ని...శ్రేయస్సును...
పురోభివృద్ధిని ప్రత్యేకించి....
అణగారిన అట్టడుగు
బడుగు బలహీన వర్గాల
జీవన ప్రమాణాలు
మెరుగు పరిచేలా...
రక్షణ కవచంలాంటి
పౌరహక్కులను చేర్చి
రాజ్యాంగం అందించిన...
ధన్యజీవి
అమరజీవి
అపర మేధావి
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ని
నిత్యం మదిలో స్మరించుకోవడం...
వారి త్యాగాలనుండి స్పూర్తిని పొందడం...
మన కర్తవ్యం మన ధర్మం మన బాధ్యత...



