ఓం మిత్రమా
నా ప్రియ నేస్తమా
నీవు ఆవులా...అమాయకంగా
ఉన్నంతకాలం..!
నీవు మేకలా....మౌనంగా
ఉన్నంతకాలం..!
నీవు జింకలా....జంకుతూ
ఉన్నంతకాలం...!
నీవు బావిలో కప్పలా....
బ్రతుకుతూ ఉన్నంతకాలం..!
సింహాలు నిన్ను
వెంటాడుతూనే ఉంటాయి..!
పులులు నిన్ను
వేటాడుతూనే ఉంటాయి..!
ఓ మనిషీ..! నిజానికి
నీలో దమ్ముంది నీలో ధైర్యముంది..!
నీలో గొడ్డుచాకిరీచేసే గుణముంది..!
నీలో పగ ఉంది నీలో పట్టుదల ఉంది..!
ఎవరితోనూ మాట
పడకూడదనే రోషముంది..!
అవసరమైతే నీవు గుర్రంలా పరుగెత్తగలవు
ఏనుగులా ఎంతటి పనినైనా చేసెయ్యగలవు
సంధ్య వేళయిందని...సమయం
మించిపోయిందని నిరాశ చెందకు..!
తొలిపొద్దు పొడుస్తుంది..!
అదిగో తెల్లవారుతుంది..!
అవిగో అరుణకిరణాలు..!
అవిగో ఆనందభాష్పాలు..!
అదిగో నవలోకం..!
అదిగదిగో నవలోకమే..!
అది నీ కోసం అది నీ కోసమే..!
మ్రొక్కాలి నీ ఇష్టదైవానికి ..!
ఎక్కాలి ఎవరెస్టు శిఖరం ..!
నీ చెమటచుక్కకు
దక్కాలి చక్కని ప్రతి ఫలితం ..!
నీ ప్రతిభకు జరగాలి పట్టాభిషేకం ..!



