ఓ మనిషి
ఏమవుతాయి నీ డబ్బులు
నీ బంగళాలు,నీ కార్లు
నీ బంగారు ఆభరణాలు
నీవు సంపాదించిన లంచగొండి సొమ్ము
ఏ కారులో ఏ విమానంలో
ఏ షిప్పులో బయటకు వెళ్లగలవు నేడు
ఎవడు నిన్ను తాకుతాడు ఈరోజు
ఏమవుతుంది నీవు కూడబెట్టిన వేల ఎకరాల భూమి
రోడ్డుకిరువైపులా పచ్చని పొలాలు మాయం చేస్తివి
పేదోడు వంద గజాల భూమి కొనుక్కునే పరిస్థితి చేజారిస్తివి
పచ్చదనం కాలరాస్తివి. పైసలకు కక్కుర్తి పడితివి
ఏమవుతాయి నీ వందల ఎకరాలు నేడు
అంతరాలు పెంచితివి
ఆత్మీయతలు తుంచితివి
డబ్బే సర్వస్వం అనుకుంటివి
డబ్బులిచ్చిఆపగలవా కరోనాను...
భూములిచ్చి ఆపగలవా కారోనాను
లంచమిచ్చి ఆపగలవా కారోనాను
మనిషిని మనిషిగా చూడవైతివి
నిన్ను కాపాడడానికి మళ్లీ
నేడు మనిషే(డాక్టర్)కావాలి
డబ్బులున్నోడికొక మర్యాద
డబ్బులు లేనోడికొక మర్యాద
నడిచొస్తే ఒక మర్యాద
కార్లోవస్తే మరొక మర్యాద
గోచి పెడితే ఒక మర్యాద
సూటు వేస్తే మరొక మర్యాద
ఎందుకీ అంతరం - ఏమవుతావు నేడు
ఓ మానవా
ఇకనైనా మేలుకోవా
అందరినీ నీలో కలుపుకోవా



