జ్ఞానోదయం....
ఈ కరోనా కష్టకాలంలో
తెలిసి వచ్చినవి, తెలివి తెచ్చినవి
స్వలాభము, త్యాగగుణం
పాపపుణ్యాలు, స్వర్గనరకాలు
లాభనష్టాలు, చీకటివెలుగులు
మంచిచెడులు, తప్పుఒప్పులు
ధర్మా,ధర్మాలు, సత్యాసత్యాలు
ప్రాణభయాలు, కాలమహిమలు
ఆకలి,
చావులు,
ఆస్తులు,
అంతస్తులు
తర,తమబేధాలు, ఎక్కవ,తక్కువతేడాలు
దురాచారాలు,
సాంఘిక,భౌతిక దూరాలు
నాది నాది అనే భావన
ఏదీ నీదికాదనే నిజము/నిత్యసత్యము
నీతి నిప్పక,
నిజాయితీగా బ్రతకాలని
స్వార్థానికి
స్వాగతం పలకరాదని.



