Facebook Twitter
కరోనా... కరోనా... కరోనా…

క    -  ష్టమైనా

రో   -  జంతా

నా  - లుగు గోడల మధ్యనే వుందాం

ఈ  కరోనా ను తరిమి తరిమికొడదాం


క    -  డుక్కుందాం సోపుతో చేతులు శుభ్రంగా 

రో   -  జంతా ఇంట్లోనే అందరం బంధీలై పోదాం

న  -   లుగురికి వీలైనంత దూరంగా వుందాం

ఈ కరోనా వైరస్ ని వ్యాప్తి కాకుండా కట్టడిచేద్దాం


క    -  ళ్ళకు కనిపించని ఈ

రో   -  గం అతి ప్రమాదకరం,ఇది కలిగించే

న  -   ష్టం  అపారం, అంచనాలకు మించే

అందుకే ఈ కరోనా రక్కసిని ఆదిలోనే అరికడదాం