Facebook Twitter
ఓ నాన్నా! మీకు పాదాభివందనం!!

మేము క్రిందపడిన ప్రతిసారి లేపి

నిలుచో పెట్టి పరుగులు తీయించి

మేము పోటీలోఓడిన ప్రతిసారి

Don't Worry Failures are

Stepping Stones for Success

Try and try till you fly into the Sky &

Try and try till you reach your Goal

అంటూ ఓదార్పు నిచ్చిన

ఓ నాన్న ! మీకు వందనం !పాదాభివందనం !

 

మా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటుంటే

మీ కంటిలో గుచ్చుకున్నంతగా కన్నీరు కార్చి

మాకు కమ్మని తిండిపెట్టి మా అందరి

కడుపులునింపి మీ కడుపు నిండినంతగా 

తృప్తిచెంది ఆనందంగా అర్థాకలితో నిద్రపోయిన

ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!

 

మాకు జబ్బులుచేస్తే డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టి

చేతిలో డబ్బులేకపోతే తలనుతాకట్టు పెట్టి 

కళ్ళుతిరిగే ఆ బిల్లులు కట్టలేక,అప్పులు తెచ్చి

ఆపై ఆ ఆప్పులు తీర్చలేనక ముప్పుతిప్పలుపడిన

ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!

 

మాకు బ్రాండెడ్ బట్టలుకొనిపెట్టి, మీరు మాత్రం

చిరునవ్వుతో చిరిగిన బట్టలతో సరిపెట్టుకుని

మాకు నచ్చిన కొత్తబూట్లు కొనిపెట్టి,మీరు మాత్రం 

అరిగిపోయిన తెగిపోయిన పాతచెప్పులతో తిరిగి

మాకు ఖరీదైన బైకులు కార్లు కొనిపెట్టి, మీరు

మైళ్ళదూరం కాలిబాటన నవ్వుతూ నడిచివెళ్ళిన

ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!

 

నాడు అవకాశంలేక మీరు అరకొర చదువులు చదివి

మమ్ము మాత్రం విదేశాలకు పంపి కలనైనా ఊహించని 

ఖరీదైన ఉన్నత విద్య నభ్యసించే భాగ్యాన్ని కల్పించిన

ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!

 

ఇంతటి మంచి మనసు మంచితనం గల తండ్రిని

ఇంతటి ప్రేమదయ కరుణజాలిగుండెగల తండ్రిని

ఇంతగా నిస్వార్థంగా శ్రమించేతత్వం గల తండ్రిని 

చేసిన తప్పుల్ని క్షమించే గుణంగల గొప్పతండ్రిని

 

కుటుంబ క్షేమంకోసం పిల్లల బంగారు భవిష్యత్తుకోసం

నిరంతరం నిద్రాహారాలు మాని తపించే తండ్రిని 

ఒక అపురూపమైన ఒక బంగారుబహుమతిగా మాకు

ప్రసాదించిన ఓ పరమాత్మకు మీకు శతకోటిదండాలు

 

నాన్నా ! ఓ నాన్నా!! 

మీకు రెండుచేతులు జోడించి

శిరస్సును వంచి నమస్కరించి

కన్నీటితో మీ పాదాలను కడిగి

కంటికి రెప్పలా కాపాడుకుంటామని

మాగుండెలో గుడికట్టి రోజు మిమ్మల్ని

ప్రత్యక్ష దైవంగా పువ్వుల్లో పెట్టి పూజిస్తామని 

పంచభూతాల సాక్షిగా నేడు ప్రమాణం చేస్తున్నాం