నిన్న ఉరుకు పరుగుల ఉద్యోగంతో
ఇల్లంటే ఒక నరకమనుకున్నాను, కాని
కరోనా వచ్చింది నాకు జ్ఞానోదయమైంది
భార్యా పిల్లలతో కమ్మనికబుర్లు చెప్పుకుంటూ
ఉల్లాసంగా ఉంటే ఆ ఇల్లే ఒక భూతలస్వర్గమని
నిన్న నాకు అందని,చెందని వాటిని ఆశించాను
అర్రులు చాశాను ఆర్జించాలని పరుగులు తీశాను
నేడు కరోనా వచ్చింది నాకు కనువిప్పు కలిగించింది
నాది నాది అనుకున్నదేదీ నాది నీది కాదని
కరోనా సోకితే కడచూపైనా ఎవరికీ దక్కదని
నిన్న కాలం విలువ, ప్రాణం ఖరీదు తెలియకపోయె
సమయాన్ని దుర్వెసనాలతో దుర్వినియోగం చేశాను
కోట్లు పోసైనా పోయేప్రాణాన్ని కొనగలననుకున్నాను
నేడు కరోనా వచ్చింది నాకొక గొప్ప సందేశాన్ని ఇచ్చింది
ఇమ్యూనిటీని పెంచుకోమని,ఆరోగ్యమే మహాభాగ్యమని,
నిన్న వీధిలో బిక్షగాళ్ళను చూస్తే విసుక్కునేవాన్ని
ఆకలిగొన్న అనాథలను చూస్తే అసహ్యించుకునేవాన్ని
కరోనా వచ్చి నా కళ్ళు తెరిపించి చెంప చెల్లుమనిపించింది
కొందరి మంచితనం త్యాగగుణం నాకొకగుణపాఠం నేర్పింది
లాకర్లో లక్షలున్నా కడకు సెల్ ఫోన్ కూడా మన వెంటరాదని



