Facebook Twitter
కరోనా కరాళ నృత్యం...

ఎక్కడుందో? ఎక్కడుందో?
కంటికి కనిపించని ఈ కరోనా రాక్షసి?
అది ఎక్కడో లేదు అది మీ ప్రక్కనే వుంది
మీ అందరి చుట్టే నక్కినక్కి తిరుగుతుంది

ఎక్కడుందో? ఎక్కడుందో?
కంటికి కనిపించని ఈ కరోనా రాక్షసి?
ఎటు వైపు నుంచైనా
ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు
కాలసర్పమై కాటువేయవచ్చు
ముందు జాగ్రత్తలు తీసుకోని వారందరినీ
మృత్యువులా కబలించివేయవచ్చు

ఎక్కడుందో? ఎక్కడుందో?
కంటికి కనిపించని ఈ కరోనా రాక్షసి?
ఐతే అకస్మాత్తుగా
ఒక సునామీలా ,ఒక సుడిగాలిలా
ఒక ప్రవాహంలా ఒక ప్రభంజనంలా రావచ్చు
భయంకరమైన వినాశనాన్ని 
కలలో కూడా ఊహించని 
విధ్వంసాన్ని సృష్టించవచ్చు

ఎక్కడుందో? ఎక్కడుందో?
కంటికి కనిపించని ఈ కరోనా రాక్షసి?
అందుకే,అది తెలియనందుకే
దాన్ని కట్టడి చేయనందుకే
నిర్లక్ష్యము వహించినందుకే
స్వీయ నియంత్రణ పాటించనందుకే
అమెరికా ఇటలీ ఇరాన్ ప్రాన్స్ స్పెయిన్ దేశాల ప్రజలు
భారీఎత్తున మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి

ఎక్కడుందో? ఎక్కడుందో?
కంటికి కనిపించని ఈ కరోనా రాక్షసి?
కాని, అది ఒక అనకొండలా,
ఆకలి గొన్న ఆడసింహంలా
చిక్కితే చీల్చివేసే చిరుతపులిలా వచ్చేసింది
ప్రపంచంమీద పిడుగల్లే విరుచుకుపడింది
ప్రళయాన్ని సృష్టిస్తుంది
విలయతాండవ మాడుతుంది
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది
అన్ని దేశాల్లో మరణమృదంగాన్ని
మ్రోగిస్తుంది జాగ్రత్త సుమీ.
So, Stay at home and Save India.