Facebook Twitter
బర్త్ డే కేక్ టు కరోనా ???

వాడు చైనావాడు
కాదేది కడుపుకనర్హమన్నట్లు
కంటికి కనిపించిన చెత్తాచెదారం
పుల్లలతో పుష్టిగా తింటాడు
కాని పాములు, కుక్కలు
పిల్లులు,బల్లులు, గబ్బిలాలతో
చేసిన వాడి బర్త్ డే కేక్ కరోనా ని
చైనా అంతా ప్రేమతో పంచి పెట్టాడు

అంతే అంతుచిక్కని, కంటికి కనిపించని
ఒక వైరస్ గా మారిన ఆ కరోనా కేక్ ను
రుచిచూసిన వూహాన్ నగరవాసులంతా
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయారు
తిన్నవాళ్ళుంతా క్షణాల్లో కన్నుమూశారు

ఆ చైనాదేశంలో పుట్టిన ఆ కరోనా వైరస్
శరవేగంగా 202 ప్రపంచ దేశాలకు పాకి
కనిపించిన వారినందరిని కబలించివేస్తుంది

కాని ఆ కరోనా మన భారత దేశానికి
రావడానికి, కాస్త భయపడుతోంది, కారణం
చేతులు రెండు జోడించి
నమస్కారించే మన ఆచార వ్యవహారాలు
ఆకుకూరలు, పండ్లు ఫలాలను
భుజించే మన మంచి ఆహారపు అలవాట్లు

సూర్యుని కంటే ముందు లేచి ప్రతినిత్యం
మనం చేసే సూర్యనమస్కారాలు
యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ లు
మన సంస్కృతి, మన సాంప్రదాయాలు
ఇవే మనకు ఆయుధాలు, ఔషధాలు
ఇవే మనకు రామబాణాలు,బ్రహ్మాస్త్రాలు

అందుకే మిత్రులారా ! భయపడకండి !
ధైర్యాన్ని కోల్పోకండి ! ఎందుకైనా మంచిది
ముందు జాగ్రత్తగా,ఇంట్లోనే బంధీలై పొండి!
మూఖానికిి మాస్కులు ధరించండి!
మందికి దూరంగా వుండండి!
తరచూ సోపుతో చేతులు శుభ్రం చేసుకోండి!

ఐనా చాటుమాటుగా,చాపకింద నీరులా,
కరోనా వస్తే మనల్ని కాటువేయడానికి,
మనందరం యుద్దానికి సిద్దంగా వుండాలి
తక్షణమే దాన్ని తరిమి తరిమి కొట్టడానికి,చంపి
సమాధిచేయడానికి,కాదుకాదు కాల్చివేయడానికి

జైహింద్... జైభారత్..