Facebook Twitter
మేమెవరోమో తెలుసా భారతీయులం....

ఓ సోసి కరోన
ఓ మాయదారి కరోనా ఎందుకే పుట్టావు ?
ఎందుకే మాపై ఇంతగా పగబట్టావు?

మేమెవరోమో తెలుసా భారతీయులం
కండబలం,గుండె బలం వున్నవాళ్ళం
మేమెవరో తెలుసా భారతీయులం
సృష్టికి ప్రతిసృష్టి చేసే విశ్వామిత్రులం
నీవంటి మాయదారి వైరస్ లెన్నింటికో
మందు కనిపెట్టినోళ్ళం మట్టుపెట్టినోళ్ళం

మా కంటికి కునుకులేకుండా చేశావు గదే
రోడ్లపై తిరిగితే రోగులమైపోతామని,
మరునాడే మాయమౌతామని శపించావుగదే
పురుగువై పుట్టి బ్రతికి పోయావు
కంటికి కనిపిస్తే నిన్ను బొంద పెట్టేవాళ్ళం
కాకులకు గద్దలకు విందు చేసేవాళ్ళం
మనిషివైతే నిన్ను మసిచేసి వుండేవాళ్ళం

మాదగ్గర ఏమున్నాయో తెలుసా?
బ్రహ్మాస్త్రాలున్నాయి,రామబాణాలున్నాయి
చిక్కితే చేతికి నిన్ను చీల్చి వెయ్యడానికి
మట్టుపెట్టడాని,భూగర్భంలో పాతిపెట్టడానికి
కంటికి కనిపిస్తే కాల్చి,బూడిద చెయ్యడానికి
కాశీలో నీ అస్థికలు కలిపెయ్యడానికి

ఎందుకే విశ్వమంతా తిరుగుతున్నావు
ప్రజల ప్రాణాలను దొంగలా దోచుకుంటున్నావు
గంటగంటకు వేలప్రాణాలను కబళించివేస్తున్నావు
మందులేదనేగా నీవింతగా చిందులేస్తున్నావు
త్వరలో మందు కనిపెడతాం, నీ భరతం పడతాం
చిమ్మచీకటిలో వున్నానని చిరునవ్వు నవ్వకు
చీకటిని చీలుస్తాము, నిన్ను చిత్రవధ చేస్తాం

ఓసోసి కరోనా,ఓ మాయదారి కరోనా,
నీతో యుద్దానికి మేము సిద్దంగా వున్నాం
దొరికితే నిన్ను సంకెళ్లతో బంధించడానికి
చంపి వెయ్యడానికి, సమాధి చెయ్యడానికి
నీ బారినపడి తిరిగిరాని
అనంతలోకాలకు తరలి వెళ్ళిన
అన్నిదేశాల మా సోదరులకు
అశ్రునివాళి అర్పించడానికి