Facebook Twitter
కరోనాను ఖతంచేద్దాం రండిరా !

మృత్యువుకన్నా క్రూరమై కానరాని
"మాయదారి మహమ్మారి కరోనా"
మన ముందే వుందిరా ! సంకెళ్లతో
బంధించి దాన్ని సమాధిచేద్దాం రండిరా!

"మాయదారి మహమ్మారి కరోనా"
"కాలసర్పమై" చాటుమాటుగా
కాటువేయనుందిరా !
కసితో "విషము" చిమ్ముతుందిరా!
దాని విషపుకోరల్ని విరిచేద్దాం రండిరా!

"మాయదారి మహమ్మారి కరోనా"
"కరాళనృత్యం" చేస్తూ మనముందే వుందిరా !
కరుణ దయ జాలిలేని కరోనాను
కాల్చిబూడిద చేద్దాం కదిలి రండిరా !
 
"మాయదారి మహమ్మారి కరోనా"
మనచుట్టే వుందిరా ! అది
"విషవృక్షమై" విశ్వమంతా వ్యాపిస్తుందిరా!
కూకటివేళ్లతో దాన్ని కూల్చివేద్దాం రండిరా!
వ్యాక్సిన్ మందేసుకొని దాన్ని బొందపెడదాం రండిరా!