ఇమ్యూనిటీ కొరబడిన ప్రజలు
కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్లుగా మారితే...
కరోనా రక్కసిని
కంట్రోల్ చెయ్యడం ఎవరితరం కాదు
కంటికి కనిపించని ఆ కరోనా
కళ్ళెంలేని గుర్రంలా పరుగులు తీస్తుంది
అతివేగంగా విస్తరిస్తుంది
అన్ని దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తుంది
హద్దూఆపూలేని...ఒమిక్రాన్ న్యూ వైరస్
విచ్చలవిడిగా ప్రపంచమంతా విజృంభిస్తుంది
ఇక మన ముందున్నది భీకరప్రళయమే...
కరోనా విషవలయమే...విలయతాండవమే...
ఔను అతి ప్రమాదకరమైన
ఈ మూడవదశకు మూలకారణం
దక్షిణాప్రికా నుండి దండయాత్ర
ప్రారంభించిన...ఒమిక్రాన్ న్యూ షవైరస్
తన విశ్వరూపం చూపించబోతుంది
మృత్యువు మృదంగనాదం వినిపించబోతుంది
అందుకే...
...డబుల్ మాస్కులు ధరిద్దాం..!
...రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుందాం..!
...అందరికి ఆరడుగుల దూరంలో ఉందాం..!
...శానిటైజర్ వాడి వ్యక్తిగతశుభ్రతను పాటిద్దాం..!
...ఇమ్యూటీని పెంచుకుందాం ఇంట్లోనె ఉందాం..!
ఆ ఐదు ఆయుధాలను ధరిద్దాం ..!
యుద్దంలో ఒమిక్రాన్ ను చిత్తుగా ఓడిద్ధాం..!
ఓ మిత్రులారా..! జాగ్రత్త..! తస్మాత్ జాగ్రత్త..!



