కరోనా ఒక "కాలసర్పం"
అది కసిదీరా కాటు వేస్తుంది
కరోనా చీకటిలో
దాగిన ఒక "చిరుతపులి"
చిక్కితే అందరినీ చీల్చి వేస్తుంది
అదెన్నో కుటుంబాల్ని కూల్చివేస్తుంది
కృంగిపోయేలా, కుమిలిపోయేలా చేస్తుంది
రక్తసంబంధాలను రంపంతో కోస్తుంది
బలహీనులను బలి తీసుకుంటుంది
అపరకుబేరులను సైతం
అధఃపాతాళానికి అణగద్రొక్కుతుంది
మన శ్వాస మీదనే దాని ధ్యాసంతా
ఊపిరితిత్తుల్లో తిష్టవేస్తుంది ఊపిరితీస్తుంది
అంతుచిక్కనిదీ ఈ "వింత వైరస్"...
మళ్ళీ వచ్చి...అందరి భరతంపడుతోంది
విశ్వమంతా విలవిలలాడిపోతుంది
ఐనా భారతీయులం మనం
కరోనాకు భయపడక్కరలేదు
కారణం,రెండు చేతులు జోడించి
"నమస్కారం చేసే సంస్కారం" మనది
సుప్రభాత వేళ చేసే,సూర్యనమస్కారాలు
నిత్యంచేసే యోగా,ధ్యానం,వ్యాయామం
మన ఆహారపు అలవాట్లే, మనకు బులెట్లు
అవే మనకు ఆయుధాలు, ఔషధాలు
అవే మనకు బ్రహ్మాస్త్రాలు,అణుబాంబులు
అవే మనకు రామబాణాలు,రక్షణ కవచాలు
తక్షణమే ధరించాలి కనిపిస్తే కరోనాను,ఖతం
చెయ్యాలి...కాల్చివెయ్యాలి...బూడిద చెయ్యాలి



