Facebook Twitter
కలియుగ దైవాలు మన కరోనాడాక్టర్లు

విధివ్రాతను తిరగ వ్రాసి ఆ విధాతనే విస్మయపరచి

పేషెంట్స్ కి పునర్జన్మను ప్రసాదించే...పుణ్యమూర్తులు

 

పెనుముప్పును తప్పించే మరుభూమి నుండి

మరలరోగులను వెనుకకు రప్పించే...మాంత్రికులు

 

అతీంద్రియ శక్తులను ఆవాహనం చేసుకొని

ఆఖరిదశలో నున్న రోగులకు కొత్త ఆయుష్షనే

అమృతం గొంతుల్లోపోసి ఊపిరిలూదే...అపరబ్రహ్మలు

 

ఘనులు...త్యాగధనులు...నిర్మలహృయులు

మంచితనానికి...మానవత్వనికి...నిస్వార్థ

సేవలకు నిలువెత్తు నిదర్శనం....

 

దయామయులు...కరుణామయులు... ప్రేమామయులు

బెడ్ మీదున్నరోగిలో దైవాన్ని దర్శించే... సేవాతత్పరులు

 

ఆగిపోకుండా రిపేరు చేసిన ఎన్నో గుండెల్లో దైవాలై

నిత్యం పూజలందుకునే...పూజనీయులు మన కరోనా డాక్టర్లు

 

పురుషుల్లో పుణ్యపురుషులే వేరయా

కరోనా డాక్టర్లకు మించిన దైవాలే ఇలలో లేరయా...

కనిపించే దైవాలు...మీరేనయా

మీకు వందనాలయా...పాదాభివందనాలయా........