ఎంతకాలం ?ఇంకంతకాలం ?
ప్రశాంతంగా బ్రతికే ప్రజల నెత్తిన
ఉరుములాఉరిమి మెరుపులామెరిసి
అకస్మాత్తుగా అర్థరాత్రి పిడుగులా
విరుచుకుపడిన ఈ ఘోరవిపత్తుకు
విశ్వమే విస్తుపోతోంది విలవిలలాడి పోతోంది
ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది
ఎంతకాలం ? ఇంకెంత కాలం ? ఈ విపత్తు?
...ఈ కరోనా విషజ్వరం
...ఈ కరోనా మృత్యుభయం
...ఈ కరోనా కల్లోలం
...ఈ కరోనా కన్నీటివరద
...ఈ కరోనా కారుచిచ్చు
...ఈ కరోనా కరాళనృత్యం
...ఈ కరోనా విధ్వంసం
...ఈ కరోనా విజృంభణ
...ఈ కరోనా విలయతాండవం
ఎంతకాలం ?ఇంకెంత కాలం? ఈ కరోనా వైరస్
లేదు లేదు భయం లేదు
అలక్ష్యము చేయనంతకాలం...
అప్రమత్తంగా వున్నంత కాలం...
సెల్ఫ్ ఐషోలేషన్ లో వున్నంతకాలం...
శుభ్రంగా చేతులు కడుక్కున్నంతకాలం...
ముందుజాగ్రత్తలు తీసుకున్నంతకాలం...
ముఖాలకు మాస్కులు ధరించినంతకాలం...
మందికి ఆరడుగులదూరం ఉన్నంతకాలం...



