Facebook Twitter
మేమెవరో తెలుసా?

ఓసీ ! కరోనా రాక్షసీ !

మేమెవరమో తెలుసా?

సృష్టికి ప్రతిసృష్టి చేసే 

"విశ్వామిత్రులం"...

 

మా నేల వేల 

ఉపద్రవాలను 

తట్టుకున్న "వేదభూమి"

బెదిరించే విషపురుగు 

గుండెల్లో నిదురించడం

"మాకు వెన్నతో పెట్టిన విద్య"...

 

ఓసీ ! కరోనా రాక్షసీ !

మేమెవరమో తెలుసా ?

"మండేసూర్యులం"...

మాతో పెట్టుకోకు, మమ్ము 

ముట్టుకోకు...మాడిపోతావు...

 

ఓసీ ! కరోనా రాక్షసీ !

మేమెవరమో తెలుసా ?

"శ్రీరాముని భక్తులం "

రామబాణాలనే రక్షణ కవచంగా 

ధరించిన మాతో

యుద్దానికి దిగకు...ఓడిపోతావు...