Facebook Twitter
మృత్యువు ముందే మూడుముళ్ళు

మ...ధురమైన పలకరింపుతో కళ్ళురెండు కలిశాయి

మ...నసులు రెండు మురిశాయి

మ...మతానురాగాలు పెనవేసుకున్నాయి

మ...తాలు కులాలు వేరైనా ప్రేమ

మ...త్తులో ఆ జంట ఊరంతా ఊరేగింది

మ...సక మసక చీకటిలో

మ...ల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో నీ

మ...నసైనది దొరుకుతుందన్న రింగ్టోన్ విని

మ...ల్లెతోటకు కెళ్తే  ఆశపడి ఆవేశపడి

మ...హమ్మారి కరోనాకోరల్లో చిక్కిమృత్యువుఒడిలో ఒరిగి

మ...త్తుగా మూలుగుతూ కోరింది తన ప్రాణసఖి

మం..గళసూత్రం ‌కట్టి ముత్తైదువుగా పంపమని నేడు

మ...రణించినా మరుజన్మలోనైనా మళ్ళీ మనం లైలా

మ...జ్నులమై పుడదామన్న ప్రేయసి కోరిక మన్నించి

మం..చితనం మానవత్వంతో ఆ భగ్నప్రేమికుడు

మం..గళసూత్రం కట్టిన మరుక్షణమే కన్నుమూసింది తన అనురాగ దేవత

మం..గళ వాయిద్యాలమధ్య తన్ను ముద్దాడింది ఆ మృత్యుదేవత