ఈ పదిసూత్రాలు పాటీస్తే....
1.
విందులకు వినోదాలకు
సభలకు సమావేశాలకు దూరంగా ఉండండి
షాపింగ్ మాల్స్ కు సినిమా హాల్స్ కు వెళ్ళకండి
2.
ఆరడుగుల నేలకు దగ్గరకాకండి
ఆరడుగుల భౌతిక దూరం పాటించండి
3.
ముఖానికి డబుల్ మాస్కులు వీలైతే
ఫేస్ షీల్డ్ లు ధరించండి మనకవే రక్షణకవచాలు
4.
శానిటైజర్ వాడండి సోపుతో చేతులు శుభ్రంగా
కడుక్కోండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి
5.
ఇంటిల్లిపాది వాక్సిన్ రెండు డోసులు వేసుకోండి
కోవిడ్ కొమ్ములు విరిచే ఇమ్యూనిటీని పెంచుకోండి
6.
వీలైతే రోజు వ్యాయామం యోగ ధ్యానం తప్పకుండా చేయండి...ఎండలో కనీసం 30 నిమిషాలు గడపండి
7.
కంటినిండా ప్రశాంతంగా 8 గంటలు గాఢనిద్రపొండి
8.
మసాలాలులేని విలువైన పోషకాహారాన్ని తీసుకోండి
9.
హంసలా ప్రతిదానిలో మంచినే వెతకండి
సానుకూలంగా ఆలోచించండి అతిభయం వద్దండి
జరగనిదానిని గురించి ఆందోళన చెందకండి
అనుమానం పెనుభూతమని మరవకండి
తొందరపడొద్దు అలాగని ఆలస్యం చేయవద్దు
అవగాహన ఉండాలి ప్రశాంత చిత్తంతో పనులు చేయాలి



