ఈ సహస్త్ర కవి భూషణ్ కవిత (ల)లో ఏముంది
- ప్రతి ఊరికి......దారి...ఉంటుంది
ప్రతి చెట్టుకు....వేరు...ఉంటుంది
ప్రతి మనిషికి...పేరు...ఉంటుంది
ప్రతి సమస్యకు...పరిష్కారం...ఉంటుంది
పోలయ్య కవి ప్రతి కవితలో...
ఒక చక్కని...సందేశం...ఉంటుంది
ఒక అర్థం...పరమార్థం...ఉంటుంది
ఒక సామాజిక...స్పృహ...ఉంటుంది
ఒక...నిత్య సత్యముంటుంది
ఒక...జీవన సూత్రముంటుంది
పోలయ్య కవి ప్రతి కవితలో...
సూర్యుని...ప్రాణశక్తి...ఉంటుంది
చంద్రుని వెన్నెల వెలుగు...ఉంటుంది
అక్షరాలలో...నక్షత్ర కాంతి...ఉంటుంది
పోలయ్య కవి ప్రతి కవిత
మనసును.......కరిగిస్తుంది
హృదయాన్ని...కదిలిస్తుంది
మనిషి మనిషిలో...
ఒక చైతన్యాన్ని రగిలిస్తుంది
కసాయికైనా...
కనువిప్పును...కలిగిస్తుంది
ఒక...ఔషధమై...
వేధించే వ్యధను బాధను...
మనో వేదనను...తొలిగిస్తుంది
ఒక...దీపమై బడుగుల జీవితాన్ని...వెలిగిస్తుంది



