ప్రకృతి ఆరాధన..!
నా కన్నీటిప్రార్థనా
చుక్కలను నింగిలోకి విసిరేస్తా..!
ఒక్క
నీటిచుక్కనైనా
కరుణించమని
నీలిమేఘాలకు నేను మ్రొక్కుతా..!
వానలు కురిపిస్తా..!
వరదలతో వాగులను మురిపిస్తా..!
నదులను నవ్విస్తా..!
కొండలమీద నా గుండెలను పరుస్తా..!
పొంగే సప్త సముద్రాలను
చూస్తూ సంబరపడిపోతా..!
ఎగిసిపడే నా కలల
అలలతో ఆడుకుంటా..!
పంచభూతాలను భక్షిస్తా..!
ప్రకృతిని నేను రక్షిస్తా..!
ఆత్మసాక్షిగా
ఆ పరమాత్మను ఆరాధిస్తా..!
వేయి ప్రాణదీపాలను వెలిగిస్తా..!
నా దేశ ప్రజలకు
రక్షణ కవచాలను తొడిగిస్తా..!
ఆపై నేను ఆనందంగా అస్తమిస్తా..!
నింగిలో ఒక నక్షత్రమై వెలుగునిస్తా!



