ఓ కవీ..! నీ కవిత్వం..!!
ఒక వ్యాసం
చేయవలసిన పనిని
వచన కవిత చేయరాదు
కుక్క పనిని గాడిద చేసిన వైనంగా...
కవిత్వంలో ...
మార్మికత...
స్పష్టత...
క్లుప్తత...
నవ్యత...
రమ్యత...
ఖచ్చితంగా కనిపించాలి...
గాలి సవ్వడిలా వినిపించాలి...
కవిత గుండెను పిండి చేయాలి...
కవి పేరును కలవరించేలా
కవిత వింటే...చెవుల్లో
మారుమ్రోగాలి
కవిత చదివితే...
హృదయానికి
హత్తుకు పోవాలి...
పాఠకులను ఏదో లోకాలకు
ఎత్తుకు పోవాలి...
గుండె పొరల్లో నిండిపోవాలి
సందేశ పరిమళాలను
సమాజమంతా వెదజల్లాలి
సమసమాజ నిర్మాణం జరగాలి...
అందుకే
చిక్కని మజ్జిగలా...
కవిత...కమ్మగా
ముగింపు...
ముచ్చటగా ఉండాలి
బాపు బొమ్మలా...
రవివర్మ వర్ణచిత్రంలా...
వీణానాదమై...వేణుగానమై...
దొంగలా మనసుల్ని దోచుకోవాలి ...
అలనాడు గోపాలబాలుడు గోపికల
హృదయాలను...దోచుకున్నవైనంగా...



