Facebook Twitter
కలం పట్టిన ప్రతివాడు కవికాడు

కలం పట్టిన ప్రతివాడు కవికాడు
ఊహల
ఊయలలో ఊరేగేవాడు
ఉప్పెనలను
ఉగ్రతలను సమాజంలోని
రుగ్మతలను రూపుమాపేవాడే కవి

కలం పట్టిన ప్రతివాడు కవికాడు
ఉచ్చులను నుండి
కార్చిచ్చులను నుండి తప్పించి
ఉగ్ర నరసింహుడై
ఉన్మాదులను ఉరి తీసేవాడే కవి

కలం పట్టిన ప్రతివాడు కవికాడు
అంతరంగ కడలిని అన్వేషించేవాడు
కలల అలల మీద స్వారీ చేసేవాడు
చిత్ర జగత్తును సృష్టించేవాడు
సమ సమాజానికి స్థాపనకు
తన జీవితాన్ని అంకితం చేసేవాడే కవి

కలం పట్టిన ప్రతివాడు కవికాడు
రైతులా రక్తం ధార పోసేవాడు 
సాహసిలా సంఘసంస్కర్తలా
సమాజంలోని అణచివేతలను...
అసమానతలను...అంతులేని
దుర్మార్గాలను అంతంచేసేవాడే కవి

కలం పట్టిన ప్రతివాడు కవికాడు
అవినీతిపరులకు ‌పాడేగట్టేవాడు
దైవంశసంభూతులకు
పాదాభివందనం చేసేవాడే కవి

కలం పట్టిన ప్రతివాడు కవికాడు
ఒక యుద్ధవీరునిలా
చెడును చీల్చి చెండాడేవాడు
చీకటి గుండెలగుడిసెల్లో
విజ్ఞాన దీపాలు వెలిగించేవాడు
సూర్యుడిలా వెలుగుల్ని నింపేవాడే కవి