ఎవరైనా ఎపుడైనా
అద్భుత కార్యాన్ని చేస్తే...
ఘనవిజయాన్ని సాధిస్తే...
కొత్త రికార్డులను సృష్టిస్తే...
మనం...మనస్పూర్తిగా
సంతోషంగా స్పందించాలి
శభాష్ అంటూ భుజం తట్టాలి
చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇవ్వాలి
ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలి
వారి పట్టుదలను...
ఏకాగ్రతను.....దీక్షను...
కసిని కృషిని...కఠోర పరిశ్రమను...
చూపిన ధైర్యసాహసాలను శ్లాఘించాలి
గజమాలతోవారిని ఘనంగా సత్కరించాలి
అలా సమయానికి
స్పందించేవారే.........సహృదయులు...
సంస్కారవంతులు...స్పూర్తి ప్రదాతలు...
కానీ...
ఆ విజేతలకు
అందిన....ఆ గౌరవానికి...
పొందిన...ఆ గుర్తింపుకు...
దక్కిన.....ఆ అఖండవిజయానికి...
ఆనందించక...అభినందించక....
లోపాలనెతికే వారే....అసూయాపరులు
అహంకారులు...అంధులు...అజ్ఞానులు
ఔను ఎప్పుడైనా సరే
ఒక మంచి పనిని చేసి విజయాన్ని
సాధించినవారిని అభినందించడానికి...
ఆపదలో నిస్వార్థంగా ఆదుకున్నవారికి
మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలపడానికి...
"ఒక అడుగు"...ముందుండాలి...
కానీ...
కళ్ళలో నిప్పులతో...
కడుపులో మంటతో...
ఓర్వలేక విమర్శించడానికి...
లోపాలను ఎత్తి చూపడానికి...
"వెయ్యి అడుగులు"...వెనకుండాలి...



