Facebook Twitter
త్రికాలం...త్రిశూలం...?

మనసు
ప్రశాంతంగా...
మనిషి
ఆరోగ్యంగా...
జీవితం
మంగళకరంగా...
నిర్మలంగా...నిశ్చలంగా...
నిశ్శబ్దంగా...నిర్భయంగా...
సుఖంగా.....సురక్షితంగా....
ముందుకు సాగిపోవాలంటే..?

గతం...
భూతమైనా
భవిష్యత్తు...
అయోమయమైనా
వర్తమానం...మాత్రం
"బంగారుమయం"...కావాలి..!

గతం...
గాలిలో దీపమైనా
భవిష్యత్తు...
విధి నోటి శాపమైనా
వర్తమానం...ఒక
"వసంత గీతం"... కావాలి..!

గతం...చేదుగా ఉన్నా
భవిష్యత్...పుల్లగా ఉన్నా
వర్తమానం..."మామిడి"
"పండులా"...మధురంగా ఉండాలి..!

గతమెంత...
గందరగోళమైనా...
భవిష్యత్తంతా...
అంధకార బంధురమైనా
వర్తమానం...మాత్రం ఒక
"వెన్నెల వెలుగు"...కావాలి..!

గతాన్ని...
ఎన్నడూ త్రవ్వకు...
భవిష్యత్తు గురించి
భయపడకు...బాధపడకు...
చెడేదో జరుగబోతుందని....
చింతించకు...చితికిపోకు...
వర్తమానంలో...ఒక రారాజులా
హాయిగా ఆనందంగా...జీవించు...!

వర్తమానం ఒక వరమని...
అది "భగవంతుడు ప్రసాదించిన
"బంగారు బహుమతి" అని...
"అందమైన ఆభరణమని....
"త్రికాలాలలో "వర్తమానం" త్రిశూలమని
భావించు...అనుభవించు....అస్తమించు..!