Facebook Twitter
ఆపదలే అతిథులుగా..?

ఆవేశపరులతో...
ఆలోచనలు
పంచుకోవడం...

అసూయపరులతో...
అభివృద్ధిని
గురించి చెప్పుకోవడం...

రంద్రాన్వేషికి...
రహస్యాలు చెప్పడం...

గజదొంగకు
గది తాళాలివ్వడం...

అజ్ఞానం...
అవివేకం...
మూర్ఖత్వం...
అమాయకత్వం...
అతి మంచితనం...

అది మనకంట్లో మనం
కారం జల్లుకున్నట్లే...

మన ఇంటికి మనం
నిప్పు పెట్టుకున్నట్లే...

మనం తీసుకున్న
గుంటలో మనం పడినట్లే...

మనం కూర్చున్న
కొమ్మను మనం నరుక్కున్నట్లే...

తెలిసి పులినోట్లో తలదూర్చినట్లే...
పిడుగుల్ని నెత్తిన పడమని పిలిచినట్లే...
ఆపదల్ని అతిథులుగా ఆహ్వానించినట్లే...