Facebook Twitter
మననోట పలికే ప్రతిమాట"..?

మన "నోట"
"పలికే ప్రతిమాట"
గుండెనూ చీల్చే
"గులాబి ముళ్ళులా"కాక
మనసును గాయపరిచే
"తూటాలా"...కాకుండా

పరిమళించే పూదోటలో
"వికసించే కుసుమంలా"...
మురిపించే మైమరిపించే
"ముత్యాల మూటలా"...
"ఊరే తేనెల ఊటలా"...
"ఉండాలంటే...?

మనం...ఏకాగ్రతతో
స్థిరచిత్తంతో ప్రేమతో
ఆచితూచి ఆలోచించి
స్పటికంలా...స్పష్టంగా
తడబడకుండా...
తప్పులు లేకుండా...
నీళ్లు నమలకుండా...

నిక్కచ్చిగా...
నిజాయితీగా...
నిర్భయంగా...
నిస్సాంకోచంగా...
నిందాస్తుతి లేకుండగ...

ముక్కుసూటిగా...
మొహమాటం లేకుండా...
అదురు బెదురు లేకుండా...
సూటిగా...
సుత్తిలేకుండా ...
స్పష్టంగా తేటతెల్లంగా...

"మామిడిరసంలా" మధురంగా
తేనెలురే విధంగా "తేనెపట్టులా"
గాయపడిన మనసుకు
చల్లని "మత్తు మందుగా"...

తన్మయత్వంతో
తాండవమాడేలా...
వినేవారికి విసుగు లేకుండా...
చెవిలో చక్కర పోసినట్లుగా...
ఆకర్షించేలా...
"అయస్కాంతంలా"...
మనిషి మనసు
పరవశించే...
"గాయత్రి మంత్రంలా"...

మత్తెక్కించే...
మధుశాలలో త్రాగిఊగేలా
ఊయల్లోని పసిపాప
హాయిగా నిద్రించే...
"జోలపాటలా"...

కొమ్మ మీది
కోయిలమ్మ ఆలపించే...
"వసంతగీతంలా"
ముద్దులొలికే గోపాలుడు
వినిపించి మురిపించే..
"మురళీ గానంలా"

ఉండాలట...ఉండాలట...
మన నోట...
మనం "పలికే ప్రతిమాట"...