ధరణిలో నడిచే దైవం..?
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
కులమతాలకతీతంగా నీవు
అందరితో పాలలో నీళ్ళలా కలిసి
పోయావంటే నీవు కల్మషంలేని
"కలుపుగోలు మనిషివని" అర్థం...
అందరు నిన్ను అందరివాడని
ఆపద్బాంధవుడని అంటున్నారంటే
నీవు "అదృష్టవంతుడవని"అర్థం...
అందరు నిన్ను ప్రేమామయుడు
కరుణామయుడు దయామయుడు
దానకర్ణుడు అంటున్నారంటే
నీవు "దైవ సంభూతుడవని" అర్థం...
అందరూ నీతో
ఆనందంగా సంతోషంగా
ఉన్నారంటే నీవు నిస్వార్థ జీవివని
"ఘనుడవని త్యాగధనుడవని" అర్థం...
అందరి ముఖాల్లో నీవల్ల
ఆనందం తాండవిస్తుందంటే..? నీవు
అందరి "తప్పుల్ని" క్షమించావని అర్థం...
అందరూ నిన్ను మంచివాడవని
మానవత్వమున్నవాడవని
శ్లాఘిస్తున్నారంటే నీవు
"మకుటంలేని మహారాజువని"అర్థం...
అందరు నిన్ను
"ధరణిలో నడిచే దైవమంటూ"
ఆరాధిస్తున్నారంటే...
"నరుడిగా "నీ జన్మధన్యమైందని అర్థం...



