ఉపవాసం
ఉపవాసం అంటూ
రోజంతా
ఉపవాసముంటూ
గుడికెళ్ళినా
ఓం ఓం అంటూ
ప్రదక్షిణలు చేస్తున్న
పొర్లు దండాలు
పెడుతున్నా...
గణగణమనిగుడిలో
గంట మ్రోగిస్తున్నా
ఇంట చేసిన ఆ
ఘుమఘుమలాడే
వంటకాలే పదేపదే
గుర్తుకు వస్తుంటే...
మనసటే లాగేస్తుంటే...
పిచ్చిఆలోచనలు రేగి...
ఊహల్లో ఊరేగే కంటే...
గాలిలో తేలిపోయే కంటే...
విహంగంలా ఏవేవో వింత
లోకాల్లో విహరించే కంటే...
కడుపు నిండా...
ఇంత తిండి తినేసి
కంటినిండా నిద్ర పోక
మదినిండా పరమాత్మను
నింపుకుని..కనులారా
విగ్రహాన్ని దర్శిస్తూ...
నోరారా స్తుతిస్తూ...
భక్తితో భజనలు చేస్తూ...
మనసారా...భగవంతున్ని
ధ్యానించుటే ఉత్తమమని
చెప్పిరట... నిన్న తాత ముత్తాతలు..!
గుడి ముందరి చెప్పులు
పదేపదే గుర్తుకొస్తుంటే
ఇక మనసెలా మాధవునిపై
లగ్నమయ్యేనురా మానవా..?
చిత్తశుద్ధిలేని శివపూజలొద్దురా యని...
బోధించెనట..! మహాకవి యోగి వేమ



