ఓ అల్లరి పిల్లలూ ! ఆకాశంలో
ఏమేమున్నాయో తెలుసా మీకు..?
భూమండలానికి
వెలుగునిచ్చే సూర్యుడు
చల్లని చంద్రుడు
నల్లనిమేఘాలు నక్షత్రాలు
ఓ బంగారు బాలలూ..!
ఈ నేలపై ఏమున్నాయో
తెలుసా మీకు..?
మనుషులు జంతువులు
పక్షులు పచ్చనివృక్షాలు
ఎత్తయిన పర్వతాలు
నదులు సముద్రాలు
లోతైన లోయలు
కొండలు కోనలు
గలగలపారే సెలయేళ్ళు
జలజలదూకే జలపాతాలు
ఓ చిలిపి చిన్నారులారా..!
నేలపై పుట్టిన ఈ మనిషి
ఏం చేస్తాడో తెలుసా మీకు..?
నాగలితో దుక్కి దున్నగలడు
పచ్చని పంటలు పండించగలడు
రాజై రాజ్యాలను ఏలగలడు
సప్తసముద్రాలను ఈదగలడు
ఆకాశంలో పక్షిలా విదేశాలలో
విమానాలలో విహరించగలడు
అలాగే పక్షులు కూడా
ఆకాశంలో ఎగరగలవు
కానీ పాపం జంతువులే
ఆకాశంలో ఎగరలేవు
స్వేచ్చగా విహరించలేవు
కారణం రెక్కలులేకపోవడమే
ఔను ఈ భువిలో మనిషి జన్మే
అత్యంత ఉత్తమమైనది
ఉన్నతమైనది ఉత్కృష్టమైనది
పిల్లలారా ! ఓ పిడుగులారా..!
ఈ మానవజన్మ
విశిష్టతను తెలుసుకోండి..!
భావిభారత పౌరులుగా ఎదగండి..!



