కొన్ని స్నేహాలు..?
కొన్ని
స్నేహాలు
నిన్ను ఏడిపిస్తాయి..!
కొన్ని మురిపిస్తాయి..!
మైమరపిస్తాయి..!
కొన్ని నిన్ను
అధఃపాతాళానికి
అణగద్రొక్కుతాయి..!
కొన్ని నిన్ను
ఊబిలో తోస్తాయి..!
ఊపిరి తీస్తాయి
కొన్ని ప్రాణం పోస్తాయి..!
కొన్ని నిన్ను
కవ్విస్తాయి నవ్విస్తాయి..!
కొన్ని నీకు ఉషోదయ
కిరణాలై వెలుగు నిస్తాయి..!
కొన్ని నిన్ను
ఎదకు హత్తుకుంటాయి
ఆకాశానికి ఎత్తుకుంటాయి..!
కొన్ని స్నేహాలు నీ ఆనందానికి
అభివృద్ధికి చక్కని సోపానాలు..!
కొన్ని స్నేహాలు నిన్ను
ఎవరెస్టు శిఖరం ఎక్కిస్తాయి..!
కొన్ని కొండలోయల్లోకి నెట్టేస్తాయి..!
అందుకే మిత్రులారా..! జాగ్రత్త..!
ఈ కల్తీస్నేహాలతో కాసింత జాగ్రత్త..!



