నీ మాటల్లో...
నీ చూపుల్లో...
నీ ప్రవర్తనలో...
నీ నిర్ణయాల్లో...
నీ ఆలోచనల్లో...
అందుకే ఓ మనిషీ..!
లతలా పైకి ఎగబ్రాకె
వారికి చేయూత నివ్వు...
ఎవరినీ అవమానించకు...
అకారణంగా ద్వేషించకు...
అసూయను వెళ్ళగ్రక్కకు...
ఎదిగేవారిని అణగద్రొక్కకు...
అంతా నాదే
అంతా నాకే అంటూ
అతిగా ఆశ పడకు...
అన్యాయంగా అక్రమంగా
అమాయకుల ఆస్తులను
దోచుకోకు...దాచుకోకు...
సిగ్గు లజ్జా
లేకుండా దర్జాగా
అనుభవించకు...
పుచ్చుకోవడమే కాదు
ఇవ్వడం కూడా నేర్చుకో...
ఎంత ఎత్తుకు
ఎదిగినా తృప్తిలేక
పీకలదాకా తిన్నా
కంచంలో మిగిలింది...
కనీసం కాపలా కుక్కకైనా
వీధిలో అరిచే బిక్షగాడికైనా పెట్టక
రేపటి కోసం ఫ్రిడ్జ్ లో దాచుకోకు...
గతంలో జీవించకు...
వర్తమానాన్ని విస్మరించకు...
భవిష్యత్తు గురించి బాధపడకు...
ఊహల్లో విహరించకు...
ఆకాశానికి నిచ్చెన వేయకు..
అనామకుడిగా అస్తమించకు..
అందుకే ఓ మనిషీ..!
మంచిని...ప్రేమను
మానవత్వపు వనంలో
పూలమొక్కల్లా పెంచు...
మంచిని అమృతంలా
అందరికీ పంచు...మౌనంగా
ఈ లోకం నుండి నిష్క్రమించు...
నింగిలో ధృవతారగా నిలిచిపో...
నిత్యం వెన్నెలవెలుగుల్ని విరజిమ్ముతూ
