Facebook Twitter
కాలపురుషుడు "కరుణిస్తే"..?

కాలం "కరుణిస్తే"..?
చిరునవ్వుల పువ్వులే...
కాలం "ఆగ్రహిస్తే"..?
"ఉగ్రరూపం" దాలిస్తే..?
ఇంట కష్టాలు కలతలే...
కంటినిండా కన్నీటి ధారలే...
బ్రతుకంతా గండాలే సుడిగుండాలే...

కనిపించని కాలం
"కరుణిస్తే" అందరూ
మనకు బంధువులే
కసిబట్టి కాలం "శపిస్తే"
అందరూ మనకు బద్దశత్రువులే

అందుకే "కాలాన్ని" ప్రేమించు
కాలాన్ని "దైవంగా" భావించు
కనిపించక నిన్ను కరుణించు
"కాలపురుషున్ని" అనునిత్యం
భక్తితో శ్రద్ధలతో భజించు...
నియమనిష్టలతో స్తుతించు...
ఆశతో అనురక్తితో ఆరాధించు...