కాలం సృష్టికర్త శాసనం..?
కావాలంటే..?
"24 గంటల సమయమే"
కుబేరుడికైనా నిరుపేదకైనా
అది సృష్టికర్త శాసనమంటే
కాదన గలరా.....? ఎవరైనా
కాలమంటే..?
సూర్యోదయాలు
సూర్యాస్తమయాలు
చీకటి వెలుగులే కాదు
కాలమంటే..?
సమయపాలనే..?
వినిపించని ఆకలి కేకలే...
కనిపించని కాంతి రేఖలే...
కాలమంటే...
సమయపాలనే...
ఆటల పోటీలే...
ఓటమి గెలుపులే...
కాలమంటే...
సమయపాలనే...
తరగని చిరునవ్వులే...
కరగని చింతలు చీకాకులే...
కాలమంటే...
సమయపాలనే...
నిజజీవితంలో సుఖదుఃఖాలే...
ఘన విజయాలే...ఘోర వైఫల్యాలే...



