కాలం తాబేలు కాదు కుందేలు కాదు..?
కొందరంటారు
కాలం కదలదని
కనిపించదని
అది కునుకు
తీసే కుందేలని ..!
కొందరంటారు
కనిపించని కాలం
తాబేలు కాదు
కుందేలు కాదు
పరుగులు తీసే గుర్రమని..!
కొందరంటారు
కాలమెంత ఖరీదైనదో
విలువైనదో తెలియాలంటే...
కరిగే కొవ్వత్తి నడగాలని..!
ఆరిపోయే దీపాన్న డగాలని..!
అవి క్షణికమని..
కాలం కలకాలమని..!
కొందరంటారు కాలమెంత
విలువైందో తెలియాలంటే..?
విరహ వేదనతో విలవిలలాడే
నిదురరాక నిరాశతో నిరీక్షించే
క్షణ మొక యుగంగా భావించే
భగ్న ప్రేమికుల్ని అడగాలని..!



