కాలంతో పోరాడు కన్నీళ్ళతో కాదు…
జీవితంలో నీకు
కోపం వచ్చినప్పుడు
మనసుతో పోరాడు
మనిషితో కాదు
కారణం...
నీ చపల చిత్తమే
నీ కోపానికి మూలం
జీవితంలో నీకు
కష్టం వచ్చినప్పుడు
కాలంతో పోరాడు
కన్నీళ్ళతో కాదు
కారణం...
దుష్ట గ్రహాలు
దుష్ట తలంపులు
దుర్ముహూర్తాలే
నీ కష్టాలకు మూలం
జీవితంలో నీకు
ఘోరమైన ఓటమి
సంభవించినప్పుడు
ఓర్పుతో పోరాడు
విధివ్రాతతో కాదు
కారణం...
రేపటి రోజున
కసితో కృషితో
క్రమశిక్షణతో కఠోరమైన
సాధనతో సాహసంతో
నీవు విధిని ఎదిరించవచ్చు
ఘనవిజయాన్ని సాధించవచ్చు



