ఓ ఉద్యోగి..!
"పదవీ విరమణ"
పేరుతో నీకెందుకు
ఉరుకు పరుగుల
ఉద్యోగం నుంచి
విరామ మిచ్చింది...
మోయలేని ఉద్యోగ
బాధ్యతల నుంచి
ఊపిరాడని
ఒత్తిడి నుండి
ఊరట కలిగించింది...
బకాసురునిలా తినేసి
కుంభకర్ణునిలా గురకలు
పెట్టి నిద్రపోయేందుకా..? కాదే
24/7
ట్విట్టర్ లో...
వాట్సాప్ లో...
ఫేస్ బుక్ లో...
ఇన్ స్టాగ్రామ్ లో...
మునిగి తేలేందుకా..? కాదే
రేయింబవళ్ళు
టీవీలో సీరియల్స్...
యూట్యూబ్ లో విచిత్రమైన
వీడియోలు వీక్షించేందుకా..? కాదే
ప్రతినిత్యం
ఒక క్రమపద్ధతిలో
వ్యాయామం యోగా
ధ్యానం చేసేందుకు...
కుటుంబం సంక్షేమం
శ్రేయస్సు చూసేందుకు...
వేళకు నిద్రపోయేందుకు..
సకాలంలో పుష్టికరమైన
ఆహారం తీసుకొనేందుకు...
మందులు వేసుకొనేందుకు...
ఆరోగ్యంగా జీవించేందుకు..
మంచి పుస్తకాలు చదివేందుకు...
బృహత్ గ్రంథాలు పఠించేందుకు...
విదేశాలకు విహారయాత్రలకు వెళ్లేందుకు...
విలువైనకాలాన్ని ప్రజాసేవలో గడిపేందుకు
నిరంతరం భగవన్నామ స్మరణలో
ధ్యానంలో నిమగ్నమై పోయేందుకు...
హాయిగా ప్రశాంతంగా ఈ జీవితాన్ని
ఎలా గడపాలో నీ అమూల్యమైన
అనుభవాలను యువతకు పంచేందుకు...
సమసమాజ నిర్మాణంలో తరించేందుకు...



