ఒక చిరునవ్వు..! ఒక మౌనవ్రతం..!!
ఒకటి
కనిపించే
తులసి మొక్క...
మరొకటి
కనిపించని
తల్లి వేరు...
ఈ రెండు
ప్రతిమనిషికి
బంగారు
ఆభరణాలే...
చిరునవ్వు...
అధరాలకు...
మౌనవ్రతం...
మనసుకు...
చిరునవ్వుతో...
ముఖమంతా
కళకళ
కనువిందు
కాంతివంతం...
మౌనవ్రతంతో...
మనసుకెంతో
హాయి ప్రశాంతత...
చిరునవ్వులు...
మనిషికి తరగని
సిరిసంపదలు...
మౌనవ్రతం...
మనసులోని
గాయాలకు
జంటల
జగడాలకు
ఒక మత్తుమందు...
చిరునవ్వు...
పెక్కు చిక్కు
సమస్యలకు
ఒక చక్కని
పరిష్కార మార్గం ...
మౌనవ్రతం...
సమస్యల
సుడిగుండం దాటి
సంసార సాగరం ఈది
ఆనంద తీరం చేరే
ఒక బంగారు నావ...
చిరునవ్వు...ఒక చిరు దీపం...
మౌనవ్రతం...ఒక మంత్ర దండం...



