Facebook Twitter
ఆరు ఆభరణాలు...

ఒక చిరునవ్వు...
ఒక మౌనవ్రతం...
ఒక కరచాలనం...

ఒక మంచి ఆలోచన...
ఒక మధురమైన మాట...
ఒక ఆత్మీయ ఆలింగనం...

ఈ ఆరు ఆయుధాలే...
ఈ ఆరు రామబాణాలే...
ఈ ఆరు వ్యక్తుల్ని వశీకరణ
చేసుకునే అతీంద్రియ శక్తులే...

ఈ ఆరు ప్రతి మనిషికి
పెట్టని అందమైన ఆభరణాలే...
సకల సమస్యల
పరిష్కారానికి...మంగళ తోరణాలే...

పరిమళించే...మల్లెపూల హారాలే...
సుఖ శాంతుల
స్వర్గ సీమకు...ముఖ ద్వారాలే...

ఊహించని విజయ శిఖరాలను
అధిరోహించే...రహస్య రాజ మార్గాలే...