Facebook Twitter
పిచ్చి కుక్క..

విశ్వాసం గల
ఓ శునకాన్ని
చంపాలనుకుంటే
సమ్మతించేదెవరు..?
మీకు మద్దతిచ్చేదెవరు..?

ఆ కుక్కకే
పిచ్చి పట్టిందని
దుష్ర్పచారం చేసి
చంపేస్తే వద్దనేదెవరు..?
మిమ్మల్ని వ్యతిరేకించేదెవరు..?

కానీ,కాలం కళ్ళు తెరిచి
నిజాన్ని కక్కేస్తే అది
పిచ్చికుక్కే కాదని తెలిస్తే...
చచ్చిన ఆ కుక్కకు
తిరిగి ప్రాణం పోసేదేవరు..?
తెలిసి చేసిన నేరానికి శిక్షేమిటి..?

ఏ హాని చేయని కుక్కను
"పిచ్చికుక్కగా" చిత్రీకరించి
అందరిలో ఆవేశాన్ని "నింపి"
"చంపి" తీరాలన్న "కసిని పెంచి"

ఆ మూగజీవుల్లాంటి
అమాయకులు
ఆర్థికంగా
రాజకీయంగా
సామాజికంగా
బలహీనులని...
బహుజనులని...
నిస్సహాయులని...
అండదండల్లేవని...
అడిగేవారు లేరని...

నిర్దాక్షిణ్యంగా...
నిరుపేద ప్రజల్ని..
పొట్టన పెట్టుకునే...
కుటుంబాలను కూల్చేసే
ఆ "మూర్ఖుల్ని" ఏం చేయాలి..?

బడిత పూజ చేయాలి...
బజారులో ఊరేగించి...
బహిరంగంగా ఉరి తియ్యాలి...