Facebook Twitter
నా దారి...! గంగా గోదారి..!!

పార్టు...1

నీవు...
ఏనుగునెక్కి
విల్లంబులతో
అడవికెళ్తే ఏం చేస్తావ్..?
అమాయకపు
జింకల్ని వేటాడుతావ్...
పులుల్ని సింహాలను కాదు

నీవు...
గాడిద నెక్కి...
మురికిబట్టలతో
ఎక్కడి కెళ్తావ్....?
చెరువు గట్టుకెళ్తావ్...

నీవు...
కత్తిపట్టి
గుర్రామెక్కితే
ఏం చేస్తావ్...?
రాజ్యాలపై దండెత్తి
రాజులనోడిస్తావ్...

కోటలను...
రాజ్యాలను...
సామ్రాజ్యాలను...
సింహాసనాలను...
రాజమందిరాలను...
ఆక్రమించుకుంటావ్...

పార్టు...2

నీవు...
ఆఫీసులో
ప్యూన్ వైతే ఏం చేస్తావ్..?
బూజు పట్టిన మట్టి
కొట్టుకుపోయిన ఫైళ్లన్నీ మోస్తావ్...

నీవు...
కలెక్టర్ వైతే ఏం చేస్తావ్..?
ఆ ఫైళ్ళ మీదనే సంతకాల్ చేస్తావ్
ఎందరి జీవితాల్నో మారుస్తావ్...

వేలమంది జీవితాల్లోనో
వెలుగులు నింపుతావ్
అందరికీ ఆదర్శంగా ఉంటావ్...

అందుకే ఓ మనిషీ..!ముందుగా
ఎంచుకో నిర్ణయించుకో నీదారి...
కాకూడదు ఎడారి...కావాలది...
గలగలపారే...గంగా గోదావరి....