ఆ రెండు జ్ఞాపకాలు...?
మనిషి జీవితంలో
మరిచి పోలేనివి
క్షణక్షణం గుర్తుకొచ్చే
జ్ఞాపకాలు రెండు..!
ఒకటి...
ఎవరైనా తమ
అమృతహస్తాలతో
మనసారా చేసిన
అత్యవసర... "సాయం"
అది ఒక "తీపి" జ్ఞాపకం...
రెండు...
పరుష పదజాలంతో
పలికిన తూటాల్లాంటి
మాటలతో మనసుకు
చేసిన మానని..."గాయం"
అది ఒక "చేదు" జ్ఞాపకం...
కానీ ఎప్పుడైనా ఎక్కడైనా
ఏదైనా సందర్భంలో ఒకరికొకరు
మూఖాముఖిగా ఎదురుపడితే...
ముఖాలు త్రిప్పుకొని మౌనంగా వెళ్ళక
చిరునవ్వుతో పలకరించుకుంటే...చాలు
మనసు విప్పి మాట్లాడుకుంటే...చాలు
అన్నీ మరిచి అభిమానంతో
ఆలింగనం చేసుకుంటే...చాలు
హృదయానికి హత్తుకుంటే...చాలు
"సారీ" అన్న ఒక్క మాటంటే...చాలు
"మనసుకు చేసిన"గాయం"
"మరుక్షణంలోనే "మటుమాయం"
"మళ్లీ చిగురిస్తాయి "స్నేహలతలు"
"కరిగిపోతాయి "కలహాలు కలతలు"



