దయగల హృదయమే దైవమందిరం..!
దయగల
హృదయం
దైవమందిరం..!
దయలేని హృదయం
పిశాచాలకు నిలయం..!
తోటి వారిపట్ల సహృదయంతో
మెలగడమే..."మానవత్వం"
అవకాశముండి ఆదుకోకపోవడం
అమానవీయం..."అమానుషత్వం"
ఇతరులను ద్వేషించడం...అత్యంత
క్రూరంగా హింసించడం..."రాక్షసత్వం"
సర్వప్రాణుల పట్ల దయ జాలి కరుణ
కలిగి ఆచరణలో చూపడం..."దైవత్వం"
ఎవరైనా...
ఈ అనిశ్ఛిత
జీవనయానంలో
"దానవత్వం" విడచి...
"దాతృత్వం"దారిలో
"మానవత్వం" మీదుగా
"దైవత్వం" వైపు ప్రయాణిస్తే...
ఖచ్చితంగా వారి జీవితం ధన్యమే...
వారికి దక్కును వేయిజన్మల పుణ్యఫలమే
ఇదే సకల మానవజాతికి లోకకల్యాణానికి
గౌతమ బుద్ధుడు అందించేటి శుభసందేశం



