Facebook Twitter
ఐతే శ్రీమతి ఆమొక బంగారు బహుమతి…

అందాలు ఆరబోసే
అతిలోకసుందరిని
ముద్దులు కురిపించే
ముగ్ధ మనోహరిని

నా హృదయ రాణిని
నా అనురాగ దేవతను
సుఖాల తీరం చేర్చే
నా సుందరాంగిని

స్వర్గసీమల్లో
విహరింపజేసే
నా స్వర్ణమయూరిని

రతిక్రీడకు రారమ్మని
అడిగిన తడవే
"ఆహ ఉహూ"
అని అడ్డు చెప్పక...

ఒయ్యారం
ఒలకబోస్తూ

మౌనంగానే
మత్తెక్కిస్తూ
మంటలు రేపుతూ

కంటిసైగలతో
కాలిమువ్వల సవ్వడితో
కాటుక కళ్ళతో కైపెక్కిస్తు

కోర్కెల
సెగలు పొగలతో
మదిని రగిలిస్తు
గలగల గాజులతో
గంధర్వ గానం వినిపిస్తూ

వంపు సొంపులతో
చిలిపి చూపులతో
చిలుక నవ్వులతో
అలక పాన్పులతో

మెలికలు తిరిగే
మేని మెరుపులతో
విరులతో విరుపులతో

పట్టెమంచంపై
పట్టు పరుపులపై

పగలు రేయి
పడక గదిలో...
పరవశింపచేసేది...

సూర్యచంద్రులు లేని
జగతిని సృష్టించేది
ఐతే "మీ శ్రీమతి"...
ఆమె మీకు
ఆ భగవంతుడు
ప్రసాదించిన
ఒక "బంగారు బహుమతి"...