Facebook Twitter
కాలం చేతిలో కీలుబొమ్మలు..!

నవ్వుతూ
నడిచే కాలం
గడిచే ప్రతి నిమిషం
సకల మానవాళికి
అందిస్తుందొక శుభసందేశం
అతి విలువైనది అతి ఖరీదైనది
కాలం ఒక కోహినూర్ వజ్రం కొనలేం

తిండి దొరకని నిరుపేదకి
తిన్నది అరగని కూబేరునికి
ఇరువురికీ ఆ భగవంతుడు
ప్రసాదించే సమయం 24 గంటలే

సమయం విలువ తెలుసుకొన్న
క్రమపద్దతిలో ఒక క్రమశిక్షణతో
ఉన్న సమయాన్ని సద్వినియోగం
చేసుకొన్న కొందరు వివేకవంతులు
ఉన్నత శిఖరాలను చేరుకుంటారు
విజేతలౌతారు విశ్వగురువులౌతారు

వారు పనిచేసే సంస్థకే కాదు
సమయానికి సైతం యజమానులే...
దివిలో ధృవతారలుగా వెలుగుతారు...
చరిత్రలో చిరంజీవులుగా మిగులుతారు

సమాజానికి మార్గనిర్దేశకులు
వారెందరికో స్ఫూర్తి ప్రదాతలు
ముందు తరాలకు వారే ఆదర్శం

కాలం విలువ తెలియక
కాలాన్ని కాలేదన్నేవారు
ఏ బరువులు మోయని
ఎందుకూ కొరగాని...వారు...
ఏ బాధ్యతలేని బలహీనులు...

వారు రేపు నిష్ప్రయోజకులుగా
నిరాశావాదులుగా నిష్క్రమిస్తారు...
కారణం వారు కాలానికి బానిసలు...
వారు కాలం చేతిలో కీలుబొమ్మలు...