పరమాత్మ కరుణిస్తేనే...?
గట్టిగ అరిస్తే
"గెలిచినట్టు" కాదు
మౌనంగా ఉంటే
"ఓడినట్టు" కాదు..!
వీధిలో "కుక్కలు"
మొరిగితే
"గజరాజులు"
గజగజ వణకవు..!
తాతకి "దగ్గు"
చేపకు "ఈత"
ఎవరూ నేర్పలేరు..!
కరుడు గట్టిన దొంగను
ఎవ్వరూ మార్చలేరు..!
తాటాకు చప్పుళ్ళకు
"కుందేళ్ళు" బెదరవు..!
"ఉరుములు" ఉరిమిన
"మెరుపులు" మెరిసిన
"కుంభ వర్షాలు" కురవవు..!
"పచ్చని పంటలు" పండవు..!
"ఆకలి మంటలు" ఆరవు...!.
నిజానికి ఆ దివిలోని...
పరమాత్మ కరుణిస్తేనే...
ఈ భువిలో...ఎవరికైనా...
"కళ్యాణం" జరిగేది
"కడుపు" పండేది
"మనసు" నిండేది..!
కోపంతో "పళ్ళు" కొరికితే
ఉద్రేకంతో "పిడికిళ్లు" బిగిస్తే
గట్టిగా "గొంతులు" చించుకుంటే
సమస్యలు "పరిష్కారం కావు..!
"శాంతి మంత్రాలు" జపిస్తేనే...
"స్నేహ హస్తాలు" ఏమైతేనే...ఈ
జీవితం...సుభిక్షం..! సురక్షితం..!
సుఖసాగరం..! సువర్ణ శోభితం..!



