Facebook Twitter
చీకటి నుండి చిమ్మచీకటిలోకి...?

ఓ మనిషీ ..!
ఏది నీది కాదని రేపు
నీ వెంటెవరూ రారని తెలిసి
ఎందుకింత ఆశ...అహంకారం..?
ఎందుకింత మిడిసిపాటుతనం..?

ఓ మనిషీ ..!
నేడేదీ పట్టుకు పోలేకున్నావు..?
కాలగర్భంలో కలిసి పోతున్నావు..?
కారణం నిన్న నీతల్లిగర్భంలో నుండి
ఏదీ పట్టుకు రాలేదు గనుక

ఓ మనిషీ ..!
మొన్న నవమాసాల
చిమ్మ చీకటి వుండి
నిన్న వెలుగులోకొచ్చాక...
బ్రతుకుబాటలో ఏదో వెతుకులాట
ఆశల ఆరాటం జీవన పోరాటం ముగిసి
నేడు తిరిగి మళ్ళీ చిమ్మచీకటి పొరల్లోకి..!