Facebook Twitter
కష్టపడడానికి ఇష్టపడండి..!

ఓ సోమరులారా..!
ఓ బద్దకస్తులారా..!
ఓ పిరికి పందలారా..!
ఓ నవయువకుల్లారా..!

నేడు...మీరు
యుక్త వయసులో
ఉన్నప్పుడు...
ఉడుకు నెత్తురుతో
ఉరుకులు పరుగులు
పెడుతున్నప్పుడు...

ఉత్సాహం మీలో
ఉరకలు వేస్తున్నప్పుడు...
ఉప్పొంగుతున్నప్పుడు...
ఒంటినిండా బలమున్నప్పుడు...
గుండెనిండా ధైర్యమున్నప్పుడు...

ఏ విపత్తునైనా సమర్ధవంతంగా ఎదుర్కోగల అనంతమైన
శక్తి యుక్తులు మీకున్నప్పుడు...
కష్టపడడానికి...ఇష్టపడక...
సిగ్గు పడితే..?...

రేపు వృద్ధాప్యంలో...
అప్పులతో
బ్రతకాల్చి వస్తుంది..!
పిల్లలముందు
ఒక దోషులుగా...
ఒక అసమర్థులుగా...
చేతుల్లో చేవలేని వారిగా... తలదించుకోవాల్సి వస్తుంది..!
సిగ్గుతో చితికి పోవలసివస్తుంది..!
జాగ్రత్త జాగ్రత్త...తస్మాత్...జాగ్రత్త..!