శుభోదయం ఒక సూర్యోదయం..!
ప్రతి ఉదయం..!
ఒక ఉషోదయమే..!
ఒక రవికిరణమే..!
ఒక వేణుగానమే..!
ఒక రామబాణమే..!
నిన్నటి చీకట్లను చీల్చి...
నిన్నటి కష్టాలను కాల్చి...
నిన్నటి గాయాలను కూల్చి...
నిన్నటి బాధల బాంబులను పేల్చి...
రేపటి బంగారు భవిష్యత్తు కోసం....
నేటిని ఎంతో అందంగా...
ఎంతో ఆకర్షణీయంగా...
ఎంతో అద్భుతంగా...
ఎంతో ఉన్నతంగా...
ఎంతో సుందరంగా...
ఎంతో శుభకరంగా...
ఎంతో శుభసూచకంగా...
ఎంతో మంగళకరంగా...
ఎంతో మనోహరంగా...
ఎంతో వినూత్నంగా...
ఎంతో వినోదభరితంగా...
ఎవరి ఊహలకందని రీతిలో...
బద్దశతృవులు సైతం"శెభాష్" అని
ఆశ్చర్యపోయేలా...అభినందించేలా
మలచుకున్న...తీర్చిదిద్దుకున్న...ఆ
శుభోదయం ఒక సుందర జలపాతం...ఆ
శుభోదయం ఒక పరిమళించే పారిజాతం.!



