Facebook Twitter
కన్నవారికి "కవచం" కావాలి..?

ఆవేశం...
అజ్ఞానం...
అహంకారం...
మొండితనం...
అమాయకత్వం...
అసూయా ద్వేషం...
"ఆస్తులుగా" కలిగినోడు
ముమ్మాటికీ మూర్ఖుడే...
దుష్టుడే పరమ దుర్మార్గుడే...

కామ...క్రోధ...
లోభ...మోహ...
మద...మాత్సర్యాలను
అరిషడ్వర్గాలను
"నియంత్రించలేని వాడు"...
"దృతరాష్ట్రుని కొడుకే"...
"దుఃఖానికి వారసుడే...

కన్నవారి మాటలను
"ఖాతరు" చేయని వాడు...
కన్నవారికి పెనుభారమైనవాడు...
కన్నవారికి"రక్షణకవచం" కాలేనివాడు...
కన్నవారి కంట కన్నీరును తుడవనివాడు..

కన్నవారి
కడుపు కోతకు...
మానసిక క్షోభకు...
కారణభూతుడైనవాడు...
తాను పట్టిన కోడిపెట్టకు ఈకలు
కోతులకు తోకలు లేనే లేవనేవాడు...

"నెగిటివ్ థాట్సే" నేస్తాలైనవాడు...
ఖచ్చితంగా శాడిస్టే...శాపగ్రస్తుడే...
అట్టి పుత్రుడు పుడమికి భారమే...
కన్నవారి బ్రతుకు ఘోరమే...అంధకారమే