Facebook Twitter
పిచ్చి కోపంతో రెచ్చిపోకు..?

ఓ మిత్రమా..! నా ప్రియ నేస్తమా..!!
నీతులు వల్లించడం...
గోతులు త్రవ్వడం...తేలికే
ఆచరించడం...పూడ్చడమే...అతి కష్టం

ఎవరినైనా
నిందించడం...విమర్శించడం...తేలికే
వాటిని
స్వీకరించడం...భరించడమే...బహుకష్టం

పచ్చి అబద్ధాలు ఆడడం...తేలికే
నిప్పులాంటి నిజాలను దాచడమే...కష్టం

ఓ మిత్రమా..! నా ప్రియ నేస్తమా..!!
ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం
ఒక సాహసమే ఒక గొప్ప విజయమే...
ఆ శిఖరం నుండి దూకడం...దుర్లభమే
అవివేకమే...అజ్ఞానమే...వెర్రితనమే...

ఉక్రోషంతో
ఊగిపోవడం...
పిచ్చికోపంతో
రెచ్చిపోవడం...
కాకిలా అరవడం...
శునకంలా మొరగడం...తేలికే...కానీ

రగిలే ఆ కోపాగ్నిని నిరంతర ధ్యానంతో...
యోగసాధనతో నియంత్రించుట కష్టమా.?
కాదే ఓ సారి ప్రయత్నించి చూడు నేస్తమా.